ఆ డైరెక్టర్ వల్లే ఈ స్థాయికి వచ్చా.. ఎప్పటికీ రుణపడి ఉంటా: మమితా బైజు
Advertisement
- నివిన్ పౌలీ, మమితా బైజుల ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఇండస్ట్రీ హిట్
- రూ. 25 కోట్ల బడ్జెట్‌తో రూ. 325 కోట్లకు పైగా వసూళ్లు
- సక్సెస్ మీట్‌లో భావోద్వేగానికి గురైన హీరోయిన్ మమితా బైజు
- డైరెక్టర్ గిరీష్ ఏడీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని వెల్లడి
Advertisement
మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు తన ఖాతాలో మరో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. నివిన్ పౌలీ సరసన ఆమె నటించిన ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ సినిమా విజయోత్సవ సభలో పాల్గొన్న మమితా.. తన సినీ ప్రస్థానంలో వెన్నుముకగా నిలిచిన దర్శకుడు గిరీష్ ఏడీని స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ఓనం పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ‘ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ, ప్రపంచవ్యాప్తంగా రూ. 325 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డులను తిరగరాసింది. ఈ అద్భుతమైన విజయం పట్ల మమితా హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణ తొలినాళ్లలో కథానాయికగా రాణించగలననే నమ్మకం తనకే లేదని వెల్లడించారు. ఆ క్లిష్ట సమయంలో దర్శకుడు గిరీష్ ఏడీ తనపై నమ్మకం ఉంచారని గుర్తుచేసుకున్నారు. ‘ప్రేమలు’ చిత్రం నుంచి నేటి వరకు తనకు వరుస అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న గిరీష్‌కు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని మమితా తెలిపారు. ఏమీ తెలియని ఓ వ్యక్తికి అండగా నిలిస్తే సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుందని, తన విషయంలో గిరీష్ అదే చేశారని ఆమె కొనియాడారు.